సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 నవంబరు 2024 (15:48 IST)

వైకాపా నేత అంబటి రాంబాబు ఇట్లో మరో సోషల్ మీడియా సైకో అరెస్టు

arrest
వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంలో వైకాపా సోషల్‌ మీడియా విభాగానికి చెందిన మరో కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర హోంమంత్రి అనితపై పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన కార్యకర్త రాజశేఖర్‌ రెడ్డి సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టాడు. దీనిపై నూజివీడులో కేసు నమోదైంది. 
 
అప్పటి నుంచి రాజశేఖర్‌ పరాలో ఉండగా, అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తూ వచ్చారు. ఈ క్రమంలో నకరికల్లులో అతడి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం అంబటి రాంబాబు స్పందిస్తూ రాజశేఖర్‌ తమ ఇంట్లోనే ఉన్నాడని.. సంబంధిత ఆధారాలు ఉంటే అరెస్టు చేసుకోవచ్చని మీడియా ముందు వ్యాఖ్యానించాడు. 
 
దీంతో బుధవారం నూజివీడు పోలీసులు.. గుంటూరులో అంబటి ఇంటికి వెళ్లారు. ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను చూపించి రాజశేఖర్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. అతని వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు, ఇప్పటికే పలువురు సోషల్ మీడియా సైకోలను పోలీసులు అరెస్టు చేస్తున్న విషయం తెల్సిందే. ే