రౌడీ షీటర్ బోరుగడ్డకు చికెన్ బిర్యానీ తినిపించిన పోలీసులపై వేటు...(Video)
వైకాపా నేత, రౌడీ షీటర్, పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కు ఏపీ పోలీసులు రాచమర్యాదలు కల్పించారు. ఆయన అడిగిందే తడవుగా ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్ళి చికెన్ బిర్యానీ తినిపించారు. అంతటితో ఆగని పోలీసులు.. పోలీసు వాహనంలో కాకుండా లగ్జరీ కారులో తీసుకెళ్లారు. ఇలా నిందితుడుకి సపర్యలు చేసిన ఏడుగురు పోలీసులకు ఏపీ ప్రభుత్వం తగిన ట్రీట్మెంట్ ఇచ్చింది. ఏడుగురు ఖాకీలను సస్పెండ్ చేస్తూ గుంటూరు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు.
మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలించే సమయంలో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ను గుంటూరు క్రాస్ రోడ్డులో ఉన్న ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. అతనితో సరదాగా మాట్లాడుతూ చికెన్ బిర్యాని తినిపించారు. రెస్టారెంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో పోలీసుల వ్యవహారం అంత నమోదు కావడంతో ఆ వీడియో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇంత సహసానికి పాల్పడిన ఏడుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.