శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 మే 2021 (13:00 IST)

ఏపీలో పదోతరగతి పరీక్షలు వాయిదా.. జూన్ 1లోపు వ్యాక్సిన్లు

ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రభుత్వ టీచర్లందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాకే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని పిటిషన్‌లో కోరారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 25వేల మంది టీచర్లు ఉన్నారని, జూన్‌ 1లోపు వారందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది వెకేషన్‌ బెంచ్‌.
 
మరోవైపు కరోనా పరిస్థితుల నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌ 7వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షల్ని మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే యధావిధిగా నిర్వహించనున్నట్లు ప్రభత్వుం ఇప్పటివరకూ చెబుతూ వచ్చింది. అయితే రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరగడంతో.. తాజాగా పరీక్షల్ని వాయిదా వేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది.