బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2017 (11:43 IST)

బయటకు రారా తేల్చుకుందాం... నీ.. అసెంబ్లీ వేదికగా టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ శుక్రవారం యుద్ధ వాతావరణానికి వేదికగా నిలిచింది. 'బయటకు రారా తేల్చుకుందాం... నీ..' అంటూ... అధికార టీడీపీ, విపక్ష వైకాపా ఎమ్మెల్యేలు తిట్ల దండకాలు చదువుకున్నారు. దీంతో ఏపీ అస

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ శుక్రవారం యుద్ధ వాతావరణానికి వేదికగా నిలిచింది. 'బయటకు రారా తేల్చుకుందాం... నీ..' అంటూ... అధికార టీడీపీ, విపక్ష వైకాపా ఎమ్మెల్యేలు తిట్ల దండకాలు చదువుకున్నారు. దీంతో ఏపీ అసెంబ్లీ సవాళ్లు, ప్రతి సవాళ్లతో గందరగోళంగా మారిపోయింది. ఒక దశలో టీడీపీ సభ్యుడు చింతమనేని ప్రభాకర్, వైకాపా సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిలు తలపడే స్థాయికి వచ్చింది. దీంతో సభలో వాతావరణం అదుపు తప్పే పరిస్థితి ఉత్పన్నం కావడంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ సభను వాయిదా వేశారు. 
 
అర్థం పర్థం లేకుండా గొడవ చేస్తున్నారంటూ వైసీపీ సభ్యులపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరు కూడా 'బయటకు రారా తేల్చుకుందాం' అంటూ ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో, చెవిరెడ్డికి మద్దతుగా ఆపార్టీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి వెళ్లారు. చింతమనేనికి అండగా వల్లభనేని వంశీ, ప్రభాకర్ చౌదరిలు నిలిచారు.