శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2023 (15:20 IST)

హిందూ ధర్మంపై ఉన్న వాళ్లే టీటీడీ ఛైర్మెన్‌గా నియమించాలి : పురంధేశ్వరి

purandheswari
హిందూ ధర్మంపై పూర్తిగా నమ్మకం ఉన్నవారినే తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌గా నియమించాలని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. అదేసమయంలో ఈ పదవి ఒక రాజకీయ పునరావాస పదవి కారాదన్నారు. హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవాళ్లే ఆ పదవికి న్యాయం చేయగలరని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం సోమవారంతో ముగిసింది. కొత్త ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈయన తితిదే ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనుండటం ఇది రెండోసారి. గతంలో సీఎంగా వైఎస్ఆర్ ఉన్న సమయంలో కూడా ఆయన ఒకసారి తితిదే ఛైర్మన్‌గా పని చేశారు. 
 
అలాంటి భూమన కరుణాకర్ రెడ్డి శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఒక నల్లరాయితో పోల్చారు. ఇది పెద్ద వివాదమైంది. ఇపుడు ఆయన్నే తితిదే ఛైర్మన్‌గా నియమించడాన్ని అనేక హిందూవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో దగ్గుబాటి పురంధేశ్వరి ట్వీట్ చేస్తూ, "ఇంతకుముందు వైకాపా ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేపట్టింది. దానిపై గళం విప్పిన తర్వాత 52 మంది నియామకం నిలిపివేశారు. ప్రభుత్వం ఈ నియామకాలను రాజకీయ పునరావాసంగానే పరిగణిస్తోందని అర్థమవుతోంది. తితిదే ఛైర్మన్‌ పదవికి హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవారిని.. ఆ ధర్మాన్ని అనుసరించేవారినే నియమించాలి. అన్య మతస్తులను కాదు" అని పురందేశ్వరి ట్వీట్‌ చేశారు.