శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2016 (15:41 IST)

ప్రత్యేక హోదా ఇస్తే ఏపీ తీవ్రంగా నష్టపోతుంది : ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్యామ్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే తీవ్రంగా నష్టపోతుందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్యామ్ కిశోర్ అభిప్రాయపడ్డారు. విభజన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీని కేంద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే తీవ్రంగా నష్టపోతుందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్యామ్ కిశోర్ అభిప్రాయపడ్డారు. విభజన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిన విషయంతెల్సిందే. దీనిపై ఏపీ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. 
 
వీటిపై శ్యామ్ కిశోర్ స్పందిస్తూ... పన్నుల వాటా పెంచి, జీఎస్‌టీ అమలు చేసిన తర్వాత ప్రత్యేక హోదాతో నష్టమేనని, ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌ ఇప్పుడు ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, ఇతర ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు వంత పాడుతున్నారని ఆక్షేపించారు. 
 
ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి వచ్చే లాభం కంటే కేంద్రం ఎక్కువగా నిధులు, పరిశ్రమలు, సంస్థలు ఏర్పాటు చేస్తూ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తోందన్నారు. హోదాతో వచ్చే లాభం కన్నా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏపీకి ఎక్కువ ప్రయోజనాలు కల్పిస్తూ అభివృద్ధికి తోడ్పడుతోందని చెప్పారు.