సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 నవంబరు 2022 (20:19 IST)

పనికిమాలిన దద్దమ్మల్లారా!.. బట్టలిప్పి కొట్టిస్తాను.. చంద్రబాబు వార్నింగ్

chandrababu
వైకాపా నేతలపై ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. వైసీపీ గూండాలు ఒకటే గుర్తుపెట్టుకోండి.. బట్టలిప్పి కొట్టిస్తానని వార్నింగ్ ఇచ్చారు. మర్యాదకు మర్యాద.. దెబ్బకు దెబ్బ.. ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలైనా ఇస్తానని ధ్వజమెత్తారు. 
 
23 బాంబులకే భయపడేది లేదని.. తనపై దాడి చేయాలనుకుంటున్నారని.. తమ కార్యకర్తలకు తాను కనుసైగ చేస్తే చిత్తు చిత్తు అవుతారని హెచ్చరించారు. పోలీసులు ఎవరికి కాపలా కాస్తున్నారని మండిపడ్డారు. కబ్జాదారులకు కాపలా కాస్తారా, రౌడీలకు అండగా ఉంటారా? అంటూ ప్రశ్నించారు. 
 
"తమ్ముళ్లూ... నన్ను రెచ్చగొడుతున్నాడు... నన్ను రెచ్చగొట్టినవాడి పతనం ఖాయం.. నేను ఎవరికీ భయపడను.." అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
 
జగన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. రాయలసీమకు ఎవరేం చేశారో చర్చించడానికి తాను సిద్ధమని అన్నారు. ఎవడ్రా రాయలసీమ ద్రోహి... పనికిమాలిన దద్దమ్మల్లారా! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనే రాయలసీమ ద్రోహి అని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.