శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : ఆదివారం, 21 మే 2017 (17:28 IST)

తిరుమలలో నారా లోకేష్‌ కుమారుడు ఆ పని చేశాడు.. ఏంటది..!

నారా కుటుంబానికి ముద్దుల పట్టి దేవాన్ష్. ఇప్పటికే వేంకటేశ్వరస్వామి కులదైవంగా ఉన్న నారా కుటుంబానికి ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా తిరుమలలోనే చేసుకోవడం అలవాటు. నారా దేవాన్ష్‌తో నారా కుటుంబం అక్షరాభ్యాసం

నారా కుటుంబానికి ముద్దుల పట్టి దేవాన్ష్. ఇప్పటికే వేంకటేశ్వరస్వామి కులదైవంగా ఉన్న నారా కుటుంబానికి ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా తిరుమలలోనే చేసుకోవడం అలవాటు. నారా దేవాన్ష్‌తో నారా కుటుంబం అక్షరాభ్యాసం తిరుమలలో చేయించింది. చిట్టి చేతులతో దేవాన్ష్ అక్షరాభ్యాసం దిద్దారు.  
 
తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దర్శించుకున్నారు. ఆలయంలో టిటిడి అధికారులు సిఎంకు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనా ఏర్పాట్లు చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి తన మనువడు దేవాన్ష్‌తో అక్షరాభ్యాసం చేయించారు. దేవాన్ష్ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో తిరుమల స్వామివారి సన్నిధిలో దేవాన్ష్‌కు అక్షరాభ్యాసం చేయించారు ముఖ్యమంత్రి. 
 
అనంతరం ఆలయం వెలుపల చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ నూతన సాంప్రదాయానికి అంకురార్పణ చేశానని చెప్పారు. దేవాన్ష్ చేత అక్షరాలు దిద్దించామని, అది కూడా అ అంటే అమ్మ, ఆ అంటే ఆంధ్రప్రదేశ్‌, అ-అమరావతి, ఆ-ఆరోగ్యం ఆ-ఆనందం ఇలా దేవాన్ష్ చేత దిద్దించామని చెప్పారు. 
 
ఎంత ఆస్తులు సంపాదించామన్నది ముఖ్యం కాదని, ఎంత నాలెడ్జ్ సాధించామన్నదే ముఖ్యమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి ఒక్కరు ఉన్నతమైన విలువలతో కూడిన వ్యక్తులుగా తయారు కావాలన్నారు. హంద్రీనీవాను ఈ సంవత్సరంలోగా పూర్తి చేస్తామని, వచ్చే సంవత్సరంకల్లా గాలేరు నగరిని పూర్తి చేసి తీరుతామన్నారు. గ్రేటర్ తిరుపతిగా మారుస్తామన్నారు చంద్రబాబు.