సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2024 (13:21 IST)

ఏపీ వరద బాధిత ప్రాంతాల్లోని వాహనదారులకు శుభవార్త!!

floods
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల్లో ఉన్న వాహనదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ శుభవార్త చెప్పారు. వరదలో మునిగిన వాహనాల మరమ్మతు ఖర్చులను గణనీయంగా తగ్గించాలని కోరారు. ఈ మేరకు బ్యాంకర్లు, బీమా కంపెనీల మేనేజర్లు, ప్రతినిధులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో వాహనదారుల క్లెయింలను వేగంగా పరిష్కరించాలని, మరమ్మతుల భారం తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
ఇప్పటికే సర్వం కోల్పోయిన వరద బాధితలకు వాహనాల మరమ్మతులు పెనుభారంగా మారకుండా చూడాలని కోరారు. మరమ్మతుల ఖర్చులు తగ్గేలా చూడాలని కోరారు. నీట మునిగిన వాహనాలు, కొట్టుకుపోయిన వాహనాలకు సంబంధించిన క్లెయింలను వేగంగా పరిష్కరించి బాధితులను ఆదుకోవాలని  కోరారు. ప్రభుత్వంతో కలిసి బాధితులను ఆదుకునేందుకు బ్యాంకర్లు, బీమా కంపెనీలు ముందుకు రావాలని ఆయన కోరారు. నిబంధనలు, కొన్ని సడలింపులు చేసి ప్రజలకు కొత్త రుణాలను మంజూరు చేయాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో క్లెయింల దరఖాస్తుకు అవకాశం కల్పించాలని బ్యాంకులు, బీమా కంపెనీల ప్రతినిధులకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు.