శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 మార్చి 2022 (17:51 IST)

3 రాజధానుల అంశంపై హైకోర్టు తీర్పు... సీఎం జగన్ సమీక్ష

ఏపీలో 3 రాజధానుల అంశంపై హైకోర్టు తీర్పుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించబోతున్నారు. హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నిపుణులు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఈ సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. 
 
సమీక్ష అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన మీడియాకు వివరించే అవకాశం ఉంది. ఇకపోతే... ఏపీలో 3 రాజధానులు అంటూ వైసీపీ ప్రభుత్వం ప్రకటించడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పునిచ్చింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని తన తీర్పులో స్పష్టం చేసింది.