శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 మార్చి 2022 (16:22 IST)

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు

ఏపీ సర్కారు ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. జేఈఈ మెయిన్‌ పరీక్షల షెడ్యూల్‌ను జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) విడుదల చేసిన తర్వాత మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22వ తేదీ నుంచి మొదలై మే 12వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం గతంలో ప్రకటించినట్టుగానే మార్చి 11వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు జరగనున్నాయి.
 
కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షల నిర్వహణ ఉంటుందని, బోర్డు తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. 1400 కేంద్రాలు పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, 900 ల్యాబ్ పరీక్షా కేంద్రాలు ఉన్నట్లు వెల్లడించారు.