అనకాపల్లిలో టైర్ల పరిశ్రమ - తొలి యూనిట్‌కు ప్రారంభోత్సవం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లిలో నెలకొల్పిన టైర్ల పరిశ్రమ తొలి యూనిట్‌కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. ఉదయం 10.20 గంటలకు విశాఖకు చేరుకుని అక్కడ నుంచి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం చేరుకుని ఈ టైర్ల పరిశ్రమను ప్రారంభించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే వాసుపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు.
కాగా, జపాన్‌కు చెందిన యోకహామా గ్రూపునకు చెందిన ఏటీసీ టైర్ల పరిశ్రమను ఇక్కడ ఉన్న పారిశ్రామికవాడలో నెలకొల్పనున్నారు. ఇందుకోసం రూ.2350 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నారు. ఇందులో తొలి యూనిట్ సిద్ధం కాగా, దీన్ని సీఎం జగన్ మంగళవారం ప్రారంభించారు.
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఈ కంపెనీ 6 ఖండాల్లో 120 దేశాల్లో విస్తరించి ఉంది. మనదేశంలో ఇప్పటికే తమిళనాడులోని తిరునల్వేలి, గుజరాత్‌లోని దహేజ్‌లో మ్యాన్యూఫాక్చరింగ్ యూనిట్లను నెలకొల్పింది. అత్యుతాపురం మూడో యూనిట్‌ను నెలకొల్పి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు.
ఏటీసీ టైర్స్ సెకండ్ ఫేజ్‌కు సీఎం జగన్ భూమి పూజ చేస్తారు. పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన పరిశ్రమకు భూమి పూజ నిర్వహిస్తారు. 202 కోట్ల పెట్టుబడి, 380 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ఈ ప్లాంట్‌లో వాటర్ ప్రూఫింగ్ ఉత్పత్తుల తయారీ, కోటింగ్, సీలెంట్స్ తదితర ఉత్పత్తుల తయారీ యూనిట్ విస్తరణకు భూమి పూజ నిర్వహిస్తారు.
మేఘ ఫ్రూట్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సిఎం భూమి పూజ చేస్తారు. కార్బొనేటెడ్ ప్రూట్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, ప్రూట్ జ్యూస్‌ల టెట్రా ప్యాకింగ్, పెట్ బాటిల్స్ తదితర ఉత్పత్తుల బెవరేజెస్ యూనిట్‌ను ఇక్కడ నెలకొల్పనున్నారు. ఇప్పటికే మంగుళూరు, సంగారెడ్డిలలో యూనిట్లు ఉన్న ఈ కంపెనీ అచ్యుతాపురం సెజ్‌లో 185.25 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందులో దాదాపు 700 మందికి ఉద్యోగాలను కల్పించనున్నారు.