గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2024 (18:14 IST)

నాలుగు కుంకీ ఏనుగులు కావాలన్న డిప్యూటీ సీఎం పవన్

pawan - siddu
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం కర్నాటక రాష్ట్ర పర్యటనకు వెళ్లారు. గురువారం ఉదయం బెంగుళూరుకు చేరుకున్న ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం సిద్ధూకు పుష్పగుచ్చాలు ఇచ్చారు. అలాగే కర్నాటక ప్రభుత్వం తరపున కూడా పుష్పుగుచ్ఛం ఇచ్చిన సీఎం సిద్ధూ.. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా తమకు నాలుగు కుంకీ ఏనుగులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, కర్నాటక అటవీశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రధానంగా ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. 
pawan - siddu
 
ఇటీవల అటవీశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష చేశారు. ఇందులో ఏనుగుల గుంపు రైతుల పొలాలను ధ్వంసం చేస్తున్న అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంలో పంట పొలాలను నాశనం చేసే ఏనుగుల మందను తరమడానికి కుంకీ ఏనుగులు అవసరమని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో రెండు కుంకీ ఏనుగులు అందుబాటులో ఉన్నాయని అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. కుంకీ ఏనుగుల కొరత ఉందని.. అందుకే ఏనుగుల్ని తరమలేకపోతున్నామని చెప్పారు. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని తీసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాన్.. తానే స్వయంగా కర్ణాటక ప్రభుత్వాన్ని కోరతానని చెప్పారు. ఆయన అధికారులకు చెప్పినట్లుగానే బెంగళూరుకు వెళ్లారు. ఏపీకి ఆరు కుంకీ ఏనుగుల్ని ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయనున్నారు.