1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 మే 2025 (08:40 IST)

పెద్దరెడ్డి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులుకు ఆదేశం : డిప్యూటీ సీఎం పవన్

pawan kalyan
చిత్తూరు జిల్లాలో అటవీ భూమిల్ని ఆక్రమించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులతో పాటు అటవీ చట్టాల ప్రకారం కూడా కేసులు నమోదు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖామంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పెద్దిరెడ్డి కుటుంబ అటవీ భూములను ఆక్రమిస్తుంటే, అడ్డుకోలేకపోయిన అదికారులను గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. 
 
పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో అటవీ, ప్రభుత్వ, బుగ్గమఠం భూముల్ని ఆక్రమించినట్టు వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ విచారణ చేసి పవన్ కళ్యాణకు నివేదిక అందజేశారు. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, భూములను ఆక్రమణలకు గురవుతుంటే రక్షించలేని అధికారులను బాధ్యుల్ని చేయాలని డీజీ సిఫార్సు చేశారు. నివేదికను పరిశీలించిన పవన్ కళ్యామ్ అటమీ భూముల ఆక్రమణలపై ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ సిఫార్సులకు అనుగుణంగా చర్యలకు ఉపక్రమించారని అధికారులను ఆదేశించారు. 
 
పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ 
 
పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ కొనసాగుతున్న వేళ భారత్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కార్యాలయ పరిధి దాటి కార్యకలాపాలు సాగిస్తున్నట్టు పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగిని దేశం నుంచి బష్కరించింది. 24 గంటల్లోగా భారత్ నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీచేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఆదేశాలు వెలువరించింది. 
 
తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ భారత్‌లో పాకిస్థాన్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న అధికారికి లేఖ రాసింది. అయితే, ఆ అధికారి పేరును మాత్రం వెల్లడించలేదు. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగిని దేశ బహిష్కరణ చేయాలని నిర్ణయించాం. అధికార హోదాకు తగ్గట్టు ప్రవర్తించలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 24 గంటల్లో సదరు అధికారి భారత్ విడిచి వెళ్లిపోవాలి అని విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. 
 
అపారంగా నష్టపోయిన పాకిస్థాన్ 
 
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్య వల్ల పాకిస్థాన్‌లో ఆస్తి, ప్రాణనష్టం భారీగా వాటిల్లింది. అయితే, తమకు ఎలాంటి హాని జరగలేదంటూ బుకాయించి, భారత్‌తో జరిగిన యుద్ధంలో తాము విజయం సాధించినట్టు పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో వెల్లడించారు. అయితే, రోజులు గడిచేకొద్దీ తమకు జరిగిన నష్టాన్ని తాజాగా వెల్లడించింది.
 
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్యలో తమ దేశ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు పాకిస్థాన్ పాలకులు తాజాగా వెల్లడించారు. ఈ ఆపరేషన్‌ ద్వారా 11 మంది సైనికులు చనిపోయినట్టు తాజాగా పేర్కొన్నారు. మృతుల్లో ఆరుగురు పాక్ ఆర్మీకి చెందిన వారుకాగా, ఐదుగురు వైమానికి దళానికి చెందిన వారని తెలిపారు. మరో 78 మంది గాయపడినట్టు పేర్కొంది. 
 
భారత్ చేపట్టిన ఆపరేషన్‌లో 40 మంది పౌరులు మరణించగా 121 మంది గాయపడినట్టు తెలిపింది. ఈ మేరకు ఆ దేశ సైన్యానికి చెందిన డీజీ ఐఎస్పీఆర్ ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
అలాగే, వైమానిక దళానికి చెందిన స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్, చీఫ్ టెక్నీషియన్ ఔరంగజేబ్, సీనియర్ టెక్నీషియన్ నజీబ్, కార్పోరల్ టెక్నీషియన్ ఫరూఖ్, సీనియర్ టెక్నీషియన్ ముబాషిర్ ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది.
 
అయితే, తమ దాడిలో 35 నుంచి 40 మంది పాక్ సౌనికులు మృతి చెంది ఉంటారని భారత్ ఇటీవల ప్రకటించిన విషయం తెల్సిందే. అలాగే, 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆపరేషన్ సిందూర్ వల్ల తమకు జరిగిన నష్టాన్ని తాజాగా వెల్లడించింది.