శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 డిశెంబరు 2022 (13:39 IST)

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం- ఏపీలో అతి భారీ వర్షాలు

Rains
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 1020 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వుంది. 
 
ఈ తుఫాను ఈ నెల 9న తమిళనాడులోని సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
ఈ తుఫాను ప్రభావంతో 8, 9, 10 తేదీల్లో దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.