సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 15 డిశెంబరు 2018 (13:01 IST)

అయేషా మీరా హత్య కేసు.. రికార్డులన్నీ దగ్ధం.. విచారిస్తున్న సీబీఐ

అయేషా మీరా హత్య కేసులో ఇప్పటివరకు సిట్ దర్యాప్తు జరిపింది. సంచలనం సృష్టించిన ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసు నిమిత్తం సీబీఐ అధికారులు శనివారం విజయవాడలో పర్యటించి వివిధ అంశాలపై దర్యాప్తు చేపట్టారని తెలిసింది. అయితే ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను హైకోర్టు సిట్ అధికారులను కోరింది. 
 
అయితే ఆ రికార్డులు విజయవాడ కోర్టులో దగ్ధమయ్యాయని చెప్పారు. దీనిపై సీరియస్ అయిన హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. అయేషా తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఈ కేసును పునర్విచారించాలని హైకోర్టు ఆదేశించింది. 
 
అలాగే విచారణకు సంబంధించిన రికార్డులను అందించాలని కోర్టు అధికారులను ఆదేశించింది. కానీ ఏడేళ్లుగా కోర్టులో ఈ కేసు విచారణలో వున్న సంగతి తెలిసిందే. కానీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణపై సీబీఐ విచారణను వేగవంతం చేసింది.