బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 నవంబరు 2024 (13:35 IST)

అల్లు అర్జున్‌కు ఊరట.. ఎన్నికల కేసును కొట్టేసిన కోర్టు

allu arjun
ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. నంద్యాల పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు బుధవారం కొట్టివేసింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో నంద్యాలలో వైకాపా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. అపుడు ఆయనను చూడటానికి భారీ సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. 
 
ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొంటూ నంద్యాల రూరల్ డిప్యూటీ తాహసీల్దారు రామచంద్రరావు ఈ యేడాది మే 11వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అల్లు అర్జున్, రవిచంద్ర కిషోర్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఇటీవల అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఉన్నత స్థాయస్థానం, నంద్యాల పోలీసుల ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసింది.