గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2024 (16:58 IST)

ఈ నెల 15 వరకు ఆ ముగ్గురు ఐపీఎస్‌లకు ఊరట

kadambari jaitwani
ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఐపీఎస్‌ అధికారులు కాంతి రాణా, విశాల్‌ గున్నీ, ఏసీపీ, సీఐ, హైకోర్టు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ఈ నెల 15వ తేదీకి వాయిదా పడింది. కౌంటరు వేసేందుకు సమయం కావాలని ఏజీ కోర్టును అభ్యర్థించారు. దీంతో విచారణ ఈ నెల 15కి వాయిదా పడింది. 
 
అయితే, అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలు వద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగింది. ముంబై నటి కాదంబరీ జత్వాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు వీరిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తనపై అక్రమ కేసు బనాయించి, ముంబై నుంచి విజయవాడకు బలవంతంగా తీసుకొచ్చి వేధించారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.