మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 7 జనవరి 2022 (23:21 IST)

ఆప్కో చేనేత డిజైన్లను చూసి అచ్చెరువొందిన సుచరిత

ఆప్కో రూపొందించిన నూతన డిజైన్లు ఆకర్షణీయంగా ఉన్నాయని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. కమర్షియల్ వస్త్ర దుకాణాలకు ధీటుగా సహకార రంగంలోని ఆప్కో వస్త్ర ప్రేమికులకు అవసరమైన అన్ని రకాల వెరైటీలను సిద్దం చేయటం అభినందనీయమన్నారు.

 
ఆంధ్రప్రదేశ్ క్రాఫ్ట్ కౌన్సిల్ నగరంలోని శేషసాయి కళ్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన సుచరిత ఆప్కో స్టాల్‌ను సందర్శించారు. చేనేత జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో ఎండి చదలవాడ నాగరాణి హోంమంత్రికి స్వాగతం పలికి సంక్రాంతి సంబరాల నేపధ్యంలో చేనేత వస్త్ర ప్రపంచానికి నూతనంగా పరిచయం చేసిన సరికొత్త డిజైన్లను గురించి వివరించారు.

 
ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ, మూస ధోరణులకు భిన్నంగా నూతనత్వానికి ప్రతీకలుగా ఆప్కో వస్త్రాలు ఉన్నాయన్నారు. ప్రత్యేకించి యువత ఆప్కో వస్త్రాలు ధరించేందుకు అలవాటు పడాలని, తద్వారా వినియోగం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆప్కో జిఎం కన్నబాబు, ముఖ్య మార్కెటింగ్ అధికారి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.