1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (10:04 IST)

వలంటీర్లు మన పార్టీ కార్యకర్తలే కదా.. వారికి గుర్తింపు లేకుండా ఎలా ఉంటుంది...!

taneti vanitha
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థను అధికార వైకాపా పార్టీ తమ పార్టీ కార్యకర్తలుగా బాగానే వాడుకుంటుంది. పార్టీ అంటే కార్యకర్తలని, పార్టీ కార్యకర్తలనే వలంటీర్లుగా నియమించామని, అలాంటి వారికి గుర్తింపు లేకుండా ఎలా ఉంటుందని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. 
 
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఆ నియోజకవర్గ వైకాపా ప్లీనరీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న హోంమంత్రి పాల్గొని మాట్లాడుతూ.. వైకాపాలో కార్యకర్తలకు గుర్తింపు లేదని కొంతమంది విషప్రచారం చేస్తున్నారని చెప్పారు. 
 
'నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చింది పార్టీ వారికి కాదా? వాలంటీరు పోస్టులు ఇచ్చింది.. వైకాపా కుటుంబాలకు చెందిన వారికి కాదా' అంటూ ఆమె ప్రశ్నించారు. మంత్రి మాట్లాడుతున్న సమయంలో పలువురు కార్యకర్తలు వెళ్లిపోయారు. ఒక సమయంలో బయటకు వెళ్లే ప్రధాన ద్వారాన్ని మూసివేయడంతో తెరవాలంటూ కార్యకర్తలు కేకలు వేయగా, తలుపు తీయాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌నాయుడు మైక్‌లో చెప్పారు.