శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 30 అక్టోబరు 2021 (13:45 IST)

అమెజాన్ ప్రతినిధులతో ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి వర్చువల్ కాన్ఫరెన్స్

టెక్నాలజీ ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా పరిపాలన అందించడంలో ప్రభుత్వంతో అమెజాన్  భాగస్వామ్యమవ్వాలని  మంత్రి మేకపాటి కోరారు. అమెజాన్ ప్రతినిధులతో ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి వర్చువల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 
 
 
ఈ స‌మావేశానికి ఐ.టీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, పరిశ్రమల శాఖ సలహాదారులు కృష్ణ జీవీ గిరి, లంకా శ్రీధర్, ఐ.టీ శాఖ సలహాదారులు శ్రీనాథ్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, అమెజాన్ కంట్రీ హెడ్ అజయ్ కౌల్, బిజినెస్ హెడ్ విజయ శకునాల, స్ట్రాటజీ హెడ్ మను శుక్లా, ఏపీ, తెలంగాణ బిజినెస్ లీడ్ దినేశ్ కనకమేడల తదితరులు హాజ‌ర‌య్యారు.
 

ఏపీ ప్రభుత్వానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ అందించడానికి గల అవకాశాలపై ప్రధానంగా చర్చ జ‌రిగింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సెంటర్ సహా పలు కీలక అంశాలపై ప్రాథమిక చర్చ చేశారు. టెక్నాలజీ ఆధారిత సేవలకు సంబంధించి అమెజాన్ ప్రతిపాదనలు తీసుకువస్తే ప్రభుత్వ పరంగా పరిశీలిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న పలు కీలక కార్యక్రమాల గురించి, ఐ.టీ ఆవశ్యకత గురించి అమెజాన్ ప్రతినిధులకు ఐ.టీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి వివరించారు.
 

ఏపీలో అమెజాన్ క్యాంపస్ ఏర్పాటుకు ముందుకు రావాలని మంత్రి మేకపాటి పిల‌పునిచ్చారు. పరిశ్రమల శాఖలో డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్, ఐ.టీ శాఖలో స్టార్టప్ లు, క్లౌడ్ టెక్నాలజీ నెక్స్ట్ లెవల్ పైనా చర్చ జ‌రిగింది. ముఖ్యమంత్రి జ‌గ‌న్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఐ.టీ అభివృద్ధికి మరింత కృషి చేస్తున్నామ‌ని మంత్రి మేకపాటి వివ‌రించారు. చీఫ్ మినిస్టర్ ఇన్నొవేషన్ ఛాలెంజ్, ఆంధ్రప్రదేశ్ సిటిజెన్ 360 స్టార్టప్ ల ఏర్పాటుకు ఓకే అని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఐ.టీ శాఖ ద్వారా ప్రభుత్వంలోని  ఇతర అన్ని శాఖలలో క్లౌడ్ టెక్నాలజీ సేవలందించే దిశగా అడుగులు వేస్తున్నామ‌ని చెప్పారు.