Daily Horoscope
✕

త్వరలో ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు

Written By ఎం
Updated: శనివారం, 6 జూన్ 2020 (09:03 IST)
ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలను అనుసరించి శాసనసభను ఎలా నిర్వహించాలనే అంశంపై శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో సమావేశం జరిగింది. 
 
రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం ఈనెల 19న పోలింగ్‌కు ఎమ్మెల్యేలు రావాల్సి ఉన్నందువల్ల ఆ రోజుకు అటూఇటుగా బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించడంపై చర్చించారు. 
 
ఈ నెల 13 లేదా 16న సమావేశాలను ప్రారంభించటంపై తొలుత చర్చ జరిగింది. 19వ తేదీ నుంచే ప్రారంభిస్తే 26 వరకు కొనసాగించవచ్చన్న ప్రతిపాదనపై కూడా చర్చించారు. 
 
మొత్తమ్మీద మూడోవారంలో వారం రోజులపాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ 19న ఉన్నందున ఆ రోజుతో కలిపి సమావేశాలు ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు.

అన్నీ చూడండి

మెగాస్టార్ చిరంజీవి సమకాలీకులు నటించిన ఆలోచన చిత్రం ట్రైలర్ లాంచ్‌

ఇప్పటి యువత తెలుసుకోవాల్సిన కథతో ఫూలే చిత్రం : డా.పొన్నం రవిచంద్ర

మిమ్మల్ని పెళ్లాడేందుకే ముంబై వచ్చా: అరిష్ఫా ఖాన్ మాటకు సల్మాన్ ఖాన్ షాక్

Brahmastra 2: హిందూ పురాణాలలో లోతు తెలియజేసేదిగా బ్రహ్మాస్త్ర 2 : అయాన్ ముఖర్జీ

Prabhas's love song: ఫౌజీలో ప్రభాస్ కోసం లవ్ సాంగ్ చిత్రీకరణ !

తర్వాతి కథనం
Show comments