తెలుగోడి దెబ్బకు ఢిల్లీ వాడు అబ్బా అనాలి : మంత్రి అవంతి శ్రీనివాస్
తెలుగోడి దెబ్బకు ఢిల్లీ వాడు అబ్బా అనాలి అంటూ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ చర్యను ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఇదే అంశంపై వైజాగ్‌లో ఉద్యమం కూడా ఊపందుకుంది.
దీనిపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందిస్తూ, బీజేపీ కంటే శక్తి వంతమైన ఇందిరా గాంధీని సైతం ఒప్పించి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నామని గుర్తుచేశారు. ఇపుడు తెలుగు వాడి దెబ్బకు ఢిల్లీ వాడు అబ్బా అనే విధాంగా మన పోరాటం చూపించాలన్నారు.
అంతేకాకుండా, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఇందిరమ్మను సైతం ప్రజలు గద్దె దించారని.. బీజేపీకి అదే గతి పడుతుందని హెచ్చరించారు. రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి ఏపీకి సమస్యలు తిష్ట వేశాయన్నారు. ప్రత్యేక హోదా లేదు, రైల్వేజోన్ లేదు, బడ్జెట్‌లో నిధులు లేవని మంత్రి అవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇపుడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటూ కేంద్రం కొత్త పాట అందుకుందన్నారు. కేంద్రంలోని పాలకులు ఉత్తరాది రాష్ట్రలను పెద్ద చూపు దక్షణాది రాష్ట్రలను చిన్న చూపు చూస్తుందని విమర్శించారు. ఏపీ ప్రజల ఉసురు తగిలి వాళ్ళు ఎవ్వరూ బాగు పడలేదన్నారు.
అదేసమయంలో పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు తిరుపతిలో ఉప ఎన్నికల మీద కాకుండా రాష్ట్ర సమస్యల మీద దృష్టి పెట్టాలని మంత్రి హితవుపలికారు. ప్రైవేటీకరణ చేస్తామని 22 మంది ఎంపీలకు కేంద్రం ఒక్క మాట చెప్పలేదన్నారు. కొంత మంది రాజీనామాలు చేసారని.. దాని వల్ల ఫలితం ఉండదు పోరాటంతోనే ఫలితాలు వస్తాయని చెప్పుకొచ్చారు.