శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (10:35 IST)

40 ఇయర్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు క్లీన్ బౌల్డ్ అయ్యారు : మంత్రి పెద్దిరెడ్డి

రాజకీయాల్లో 40 యేళ్ల ఇండస్ట్రీ అంటూ గొప్పలు చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్లీన్ బౌల్డ్ అయ్యారంటూ ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో దశ ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా,  పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైసీపీ మద్దతుదారులు 80శాతానికి పైగా సర్పంచ్‌ స్థానాలను కైవసం చేసుకున్నారు. 
 
ఈ అంశాన్ని ప్రస్తావించిన మంత్రి పెద్దిరెడ్డి... 'కుప్పం ఓటమితో 40ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు క్లీన్‌ బౌల్డయ్యాడు. ఈ ఫలితాలపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తాడా లేక కుట్రలే పన్నుతూ రాజకీయాల్లోనే కొనసాగుతాడా? అనేది తేల్చుకోవాలి' అని చెప్పారు. 
 
కుప్పం మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంటామని చెప్పారు. ఎస్‌ఈసీ గురించి తానేమీ మాట్లాడబోనని, చంద్రబాబు కొన్ని వ్యవస్థలను చేతిలో పెట్టుకుని తమను టార్గెట్‌ చేశారన్నారు. ఇకనైనా ఆయన బుద్ధి తెచ్చుకోవాలన్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ త్వరలో చంద్రబాబుకు పిచ్చి పట్టడం ఖాయమని, అందుకే ఆయన నిమ్మగడ్డపై మండిపడుతున్నారని చెప్పారు. నిమ్మగడ్డలో మార్పు కనిపిస్తోందని, చంద్రబాబు కుట్రలకు మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు.