మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (11:13 IST)

రాజకీయాల్లోకి రాధిక శరత్ కుమార్.. చెప్పిందెవరంటే?

సీనియర్ నటి రాధిక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని ఎస్‌ఎంకే నేత శరత్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటి రాధిక భర్త శరత్‌కుమార్‌ నేతృత్వంలోని సమత్తువ మక్కల్‌ కట్చి మహిళా విభాగం ఇన్‌చార్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో శరత్‌కుమార్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాధిక పోటీ చేయనున్నారని ప్రకటించారు. అన్నాడీఎంకే కూటమిలోనే ఉన్నామని, అధిక సీట్లు ఆశిస్తున్నామని ప్రత్యేక చిహ్నంపై పోటీ చేస్తామన్నారు. 
 
కాంగ్రెస్‌లో ఏళ్ల తరబడి శ్రమించిన నేత కరాటే త్యాగరాజన్‌. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినానంతరం రజనీకాంత్‌ పార్టీ ప్రకటన కోసం ఆశగా ఎదురుచూశారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు.  దీంతో త్వరలో ఆయన బీజేపీలోకి చేరడం ఖాయం అని మద్దతుదారులు పేర్కొంటున్నారు.