గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 జనవరి 2023 (11:33 IST)

ఏపీ మంత్రి రోజా ఇంట భోగి పండుగ.. నెట్టింట వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఆర్కే రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో రోజాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు భోగి మంటలకు నిప్పు పెట్టడంతో పాటు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
 
ఈ విజువల్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను చూసిన రోజా ఫ్యాన్స్ ఆమెకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సంబరాలలో రోజా వున్నప్పటికీ, ఇటీవల మెగా కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యల కారణంగా మంత్రి రోజా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.