'లాటరీల రాంబాబు'గా మంత్రి అవతారం ... కేసు నమోదుకు కోర్టు ఆదేశం
ఏపీలో అధికార వైకాపా మంత్రి అంబటి రాంబాబు ఇపుడు మరో కొత్త అవతారమెత్తారు. లాటరీల రాంబాబుగా మారిపోయారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆయన వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీడ్రా పేరుతో లాటరీ టిక్కెట్ల విక్రయానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఆయనపై తక్షణం కేసు నమోదు చేయాలంటూ పోలీసులను గుంటూరు జిల్లా ప్రిన్సిపల్ సివిల్ కోర్టు ఆదేశించింది.
వైఎస్ఆర్ సంక్రాంతి సంబరాల పేరిట సత్తెనపల్లి నియోజకవర్గంలో వైకాపా నేతలు, కార్యకర్తల ద్వారా లక్కీడ్రా కూపన్లు విక్రయిస్తున్నారంటూ జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలకు గులాంగిరి చేసే పోలీసులు మంత్రి అంబటిపై కేసు నమోదు చేయలేదు. దీంతో ఫిర్యాదుదారుడు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తక్షణమే అంబటిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది.