శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 1 మే 2017 (11:14 IST)

పవన్ కల్యాణ్ మంచోడు... రాజకీయాలకు సరైనోడు కాదు: మంత్రి సోమిరెడ్డి

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చాలా మంచోడని, కానీ, రాజకీయాలకు సరైనోడు కాదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చాలా మంచోడని, కానీ, రాజకీయాలకు సరైనోడు కాదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 
 
పవన్ చాలా మంచి వ్యక్తని, ఆయన రాజకీయాలకు తగడని తాను భావిస్తున్నానని అన్నారు. తాను పెట్టుబడులు పెట్టలేనని, ఎన్నికల్లో గెలుస్తానో లేదో అన్న మాటలు ఆయన నోటి నుంచి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, రాజకీయ నాయకులకు ఈ తరహా దృక్పథం పనికిరాదని, బలమైన చిత్తంతో రాజకీయాల్లో ఉండాల్సి ఉంటుందన్నారు. 
 
ఆయన ప్రజల మంచిని కోరుతారనడంలో సందేహం లేదన్నారు. పవన్ కల్యాణ్ ఏ సమస్యపై మాట్లాడినా, అందులో కొంత అర్థం ఉంటోందని, వాటి పరిష్కారానికి తమ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మంత్రి సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. లోపల ఒకటి పెట్టుకుని తన స్వప్రయోజనాల కోసం జగన్ మాదిరిగాపైకి వ్యవహరించే వ్యక్తి పవన్ కాదని అన్నారు.
 
ఇకపోతే చంద్రబాబు 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై తిరుగుబాటు ప్రయత్నం జరిగిందన్నారు. తిరుబాటుకు మద్ధతిచ్చేందుకు నాటి విపక్ష నేత వైఎస్ కూడా ముందుకు వచ్చారని తెలిపారు. ఈ తిరుగుబాటుకు కేసీఆర్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చొరవ చూపారని వెల్లడించారు. అయితే ఆ ప్రయత్నాన్ని తాను అడ్డుకున్నానని సోమిరెడ్డి చెప్పారు.