గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , మంగళవారం, 17 ఆగస్టు 2021 (19:22 IST)

సీఎం జ‌గ‌న్ ని అభినందించిన ఏపీ ఎంపీడీవోల సంఘం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌, ఏపీ ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు ప్ర‌త్యేకంగా అభినందించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎంపీడీవోల పదోన్నతికి అడ్డంకిగా ఉన్న సమస్యను, వన్‌ టైం మేజర్‌ విధానం ద్వారా పరిష్కరిస్తూ, ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా ఎంపీడీవోలకు పదోన్నతి అవకాశాలు రావడమే కాక, పంచాయతీ రాజ్‌ శాఖలోని ఎంపీడీవో దిగువ స్ధాయిలోని 12 కేడర్లకు చెందిన వేలాది మంది ఉద్యోగులకు కూడా పదోన్నతి అవకాశాలు మెరుగుపడనున్నాయని ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు సీఎంకి వివరించారు.

ముఖ్యమంత్రిని సత్కరించిన వారిలో ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు వై.బ్రహ్మయ్య, ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు జీ.వీ.నారాయణ రెడ్డి, కే.శ్రీనివాస రెడ్డి, కే.ఎన్‌.వీ.ప్రసాదరావు, నాతి బుజ్జి త‌దిత‌రులున్నారు.