బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (18:37 IST)

ఏపీలో 24 గంటల్లో 585 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా ప్రవహిస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 585 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరగడంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. గతంలో గరిష్టంగా 30 కేసులు మాత్రమే నమోదు కాగా, ఇపుడు ఈ సంఖ్య 585కు పెరిగాయి. 
 
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 128 కేసులు నమోదయ్యాయి. రెండో స్థానంలో 99 కేసులతో గుంటూరు జిల్లా ఉండగా... 8 కేసులతో కడప జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇదే సమయంలో చిత్తూరు, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.
 
తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,95,121కి పెరిగింది. ఇదే సమయంలో 8,84,978 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 7,197 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,946 యాక్టివ్ కేసులు ఉన్నాయి.