1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 నవంబరు 2023 (11:05 IST)

స్కూళ్లు, కాలేజీలకు బంద్- విద్యార్థి సంఘాలు బంద్

schools closed
విశాఖ ఉక్కు పరిరక్షణ, కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు మద్దతు ప్రకటించిన ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 8 (బుధవారం) రోజున స్కూళ్లు, కాలేజీలకు విద్యార్థి సంఘాలు బంద్ ప్రకటించాయి. 
 
ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం నిరసనలు ప్రారంభించి బుధవారానికి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఈ బంద్ చేపడుతున్నట్లు విద్యార్థి సంఘాల నేతలు వెల్లడించారు.  
 
విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి. ఇప్పటికే కడప జిల్లాలోని బేతంచెర్ల సీఐటీయూ కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు బంద్‌కు సంబంధించి పోస్టర్లను విడుదల చేశారు.