మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (17:40 IST)

తమ శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

girls
నేటి విద్యార్థులలో అసాధారణ ప్రతిభ వుంది. చేయాల్సిందల్లా వారి ప్రతిభకు మెరుగులద్దటం, వారి నైపుణ్యం ప్రదర్శించుకునే వేదిక అందించటం. అలాంటి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నైపుణ్యాలు, అత్యుత్తమ ఆలోచనలను ప్రదర్శించేందుకు వేదికగా నెల్లూరులో నిర్వహించిన NXplorers కార్నివాల్ నిలిచింది. నెల్లూరు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి ఎంపికైన 108 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ మరియు మ్యాథమెటిక్స్) రంగాలలో తమ వినూత్న ఆలోచనలను ప్రదర్శించారు. వందలాది ఎంట్రీల నుండి ఎంపిక చేయబడ్డ మొత్తం 43 "మార్పు ప్రాజెక్ట్‌లు" ఇక్కడ ప్రదర్శించబడ్డాయి.
 
షెల్‌కు చెందిన గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ సోషల్ ఇన్వెస్ట్‌మెంట్ స్టెమ్ విద్యా కార్యక్రమం NXplorers జూనియర్ ప్రోగ్రామ్. ఇది యునైటెడ్‌నేషన్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు(SDGలు)లో వెల్లడించినట్లుగా, స్థానిక మరియు గ్లోబల్ సవాళ్లను అర్థం చేసుకోవడం, నావిగేట్ చేయడం, పరిష్కరించడం ద్వారా పాఠశాల పిల్లలకు ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం జాతీయ విద్యా విధానం 2020కి కూడా అనుగుణంగా ఉంది.
 
“అనుభవపూర్వక అభ్యాసం మరియు దాని వినియోగంతో విద్యార్థులు అభివృద్ధి చెందుతారు. STEM విద్య విధానం పిల్లల ఆలోచనలను తీర్చిదిద్దడంలో అపరిమితమైన అవకాశాలను అందిస్తుంది. యువ మనస్సులను తీర్చిదిద్దడం, భావి శాస్త్రవేత్తలను అభివృద్ధి చేయడం కోసం నిబద్ధతతో ఉన్న స్మైల్ ఫౌండేషన్, షెల్ ఇండియాలకు ధన్యవాదాలు,” అని ఆంధ్రప్రదేశ్, స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సైన్స్ లెక్చరర్ డాక్టర్ రవి అరుణ అన్నారు.
 
స్మైల్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని తెలంగాణలోని అవిభాజ్యపు వరంగల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలతో పాటుగా కేరళలోని త్రిసూర్ జిల్లాలో మొత్తం 203 పాఠశాలల్లో అమలు చేస్తోంది. ఇది 6, 7 అకడమిక్ గ్రేడ్‌లలోని 10 నుండి 12 సంవత్సరాల వయస్సు గల 25,000 మంది పాఠశాల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తోంది. నెల్లూరు జిల్లా స్థాయి కార్నివాల్ సందర్భంగా, ప్రదర్శించిన నమూనాలలో KNR MCHS BV Nagar, నెల్లూరు విద్యార్థులు తయారుచేసిన నది-క్లీనర్ సోలార్ బోట్ ప్రాజెక్ట్, BVS MC గర్ల్స్ HS నవాబ్‌పేట్ అభివృద్ధి చేసిన పంట రక్షణ వ్యవస్థలో ఇన్‌బిల్ట్ సెన్సార్, ZPHS నారాయణరెడ్డిపేట రూపొందించిన సోలార్ ఇరిగేషన్ మోడల్ ఆకట్టుకున్నాయి.