ఏపీలోని వాతావరణంలో పెను మార్పులు.. కారణం ఏంటో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 24 గంటల్లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. నైరుతి దశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావం కారణంగా వచ్చే మూడు రోజుల్లో వాతావరణంలో ఈ మార్పులు సంభవిస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ప్రధానంగా ఉత్తర కోస్తాలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే, దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు లేదా ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, మంగళవారం తేలికపాటి వర్షాలు లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇక రాయలసీమ ప్రాంతంలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని, సోమ, మంగళవారాల్లో తేలికపాటి వర్షాలు లేదా ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.