శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

హైదరాబాద్ నగరంలో విస్తారంగా వర్షాలు

హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, సూర్యపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సూర్యపేట జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆ జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరిపోయింది. జిల్లాలోని ఎర్కకారంలో రికార్డు స్థాయిలో 14.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 
 
మరోవైపు, జిల్లాలో అకాల వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి జిల్లా అధికారులను కోరారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు మునిసిపల్ కమిషనర్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో మంత్రి జగదీశ్ రెడ్డి ఒక సమీక్షా సమావేశం నిర్వహించి, లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన అధికారులను కోరారు.