గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 13 డిశెంబరు 2020 (08:14 IST)

18 నుంచి పట్టాలెక్కనున్న అరకు రైలు

ఈ నెల 18 నుంచి అరకు రైలు పట్టాలెక్కనుంది. లాక్ డౌన్ వల్ల నిలిచిపోయిన విశాఖ కిరండోల్ అరకు రైలును ఈనెల 18వ తారీకు నుంచి ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

పర్యాటకులను ఆకట్టుకునే విస్టోడం భోగిని ప్రస్తుతం అందుబాటులోకి తీసుకురావడం లేదన్నారు. ఈ రైలు విశాఖలో ప్రతిరోజు ఉదయం 6 గంటల 45నిమిషాలకు బయలుదేరుతుందని తెలిపారు.

ఉత్తరాది మీదుగా పయనిస్తున్న వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ ప్రభావంతో విశాఖ ఏజెన్సీ, శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి.

సాయంత్రం 5 గంటల నుంచే ఆకాశమంతా మంచు తెరలు కప్పినట్లుంటోంది. రాత్రి వేళ బాగా చలిగాలులు వీస్తున్నాయి.