గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 13 డిశెంబరు 2020 (07:50 IST)

ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా 14న ఏపీయూడబ్ల్యూజే ధర్నా

అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం లేకుండా ఆదేశాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 14 వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఏపీయూడబ్ల్యూజే నేతలు తెలిపారు.

ఏపీయూడబ్ల్యూజే పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాలు జరుగనున్నాయని తెలిపారు.  ప్రభుత్వ అధికారులతో మీడియా  అక్రెడిటేషన్ కమిటీలను ఏర్పాటు చేస్తూ సమాచార పౌరసంబంధాల శాఖ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.

అక్రెడిటేషన్ జారీలో ఈసారి  అన్యాయం జరిగితే  సంక్షేమ పథకాల అమలులో జర్నలిస్టులకు  గండి పడుతుందన్న వాస్తవాన్ని గుర్తించి, ప్రతీఒక్కరూ బాధ్యతగా భావించి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.