శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: మంగళవారం, 10 నవంబరు 2020 (15:12 IST)

ఏపీలో ఆరోగ్యశ్రీ విస్తరణ, 234 వైద్య ప్రక్రియలకు ఉచిత చికిత్స: వైఎస్ జగన్

ఏపీలో దివంగత మాజీ ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరింత విస్తరింపజేశారు. ఇందులో భాగంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలకు విస్తరింపజేసింది. నేటి నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాలో ఆరోగ్యశ్రీ అమల్లోకి వస్తుందని సీఎం జగన్ తెలిపారు.
 
ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ చికిత్సల విస్తరణను ఆయన ప్రారంభించారు. ఇకపై ఇందులో క్యాన్సర్ వ్యాధితో సహా పలు వైద్య ప్రక్రియలకు సంబంధించి ఉచితంగా చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు 7 జిల్లాల్లో అమలైన ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి మిగిలిన 6 జిల్లాల్లోనూ ప్రారంభం కానున్నాయి.
 
ఇప్పటి వరకు ఉన్న ఆరోగ్యశ్రీ జాబితాలో అదనంగా మరో 234 వ్యాధులను కూడా ప్రభుత్వం చేర్చింది. ఆసుపత్రిలో రూ.1000 బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తారు. బిల్లు 1000 దాటితే మిగతా బిల్లును ప్రభుత్వమే చెల్లిస్తుంది.