శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 మార్చి 2018 (15:36 IST)

అసెంబ్లీలో జగన్ లేకపోవడంతో మాకు పబ్లిసిటీ తగ్గిపోయింది : మంత్రి అచ్చెన్నాయుడు

అసెంబ్లీలో వైకాపా అధినేత, విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి లేకపోవడం వల్ల తాము మాట్లాడే మాటలు ప్రజల్లోకి వెళ్లడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే మాకు పబ్లిసిటీ తగ్గి

అసెంబ్లీలో వైకాపా అధినేత, విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి లేకపోవడం వల్ల తాము మాట్లాడే మాటలు ప్రజల్లోకి వెళ్లడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే మాకు పబ్లిసిటీ తగ్గిపోయిందన్నారు. 
 
మంగళవారం అసెంబ్లీ లాబాల్లో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ కేసీఆర్ ప్రకటన వెనుక ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారేమో అనిపిస్తోందన్నారు. అసెంబ్లీలో విపక్షం లేక పోవడం వల్ల ఏం మాట్లాడినా జనంలోకి వెళ్లడం లేదని వ్యాఖ్యానించారు.  
 
ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రకటన చేశారని అభిప్రాయపడ్డారు. అయితే, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీలకు జరిగే ఎన్నికలు 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు దేశ రాజకీయాలపైనా ఉంటుందన్నారు.