బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 21 నవంబరు 2024 (16:44 IST)

కర్నూలులో దారుణం: చిన్నారి శరీరానికి రంగు పూసి భిక్షాటనకు రోడ్డుపై కూర్చోబెట్టారు

boy
రాష్ట్రంలో పలుచోట్ల చిన్న పిల్లలపై అమానవీయ సంఘటనలు జరుగుతున్నాయి. వారి శరీరానికి విగ్రహాలకు పూసే రంగులు పూసి నడిరోడ్డుపై భిక్షాటన చేయిస్తున్నారు. ఇలా చేసేందుకు నిరాకరించే చిన్నారులను తీవ్రంగా కొట్టి భయపెట్టి వారితో ఆ పనులు చేయిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన కర్నూలులో వెలుగుచూసింది.
 
బాలుడిని తీవ్రంగా కొట్టి ఒంటిపై రంగు పూసి రోడ్డుపై భిక్షాటన కోసం కూర్చోబెట్టారు. ఎండ‌కు తాళ‌లేక అల్లాడిన బాలుడు నిద్రతో కూరుపాట్లు పడుతున్నాడు. ఈ దృశ్యాలను వీడియో తీసి సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసారు స్థానికులు. బాలుడిని ర‌క్షించాల‌ని మంత్రి నారా లోకేష్ కి సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించడంతో ఆయన వెంటనే స్పందించారు. బాలుడు ఎక్క‌డ ఉన్నాడో తెలుసుకుని ర‌క్షించాలంటూ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసారు. వెంటనే అధికారులు రంగంలోకి దిగారు.