గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 16 నవంబరు 2024 (17:13 IST)

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

roti kapada romance team with Teja Sajja
roti kapada romance team with Teja Sajja
నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. నవంబరు 22న ఈ చిత్రం  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకను  హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
 
ఈ సందర్భంగా తేజా సజ్టా మాట్లాడుతూ '' ఈ వేదిక మీద వున్న నూతన టాలెంట్‌కు ఈ సినిమా ఎన్నో ఏళ్ల కల. ఈ చిత్రంతో నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ ఎంతో మంది నూతన నటీనటులను పరిచయం చేస్తున్నాడు. ఆయన్ని చూస్తే ఎంతో ఇన్‌స్పయిరింగ్‌గా వుంటుంది. ఆయన ఇప్పటి వరకు తీసిన 14 సినిమాల్లో ఎంతో మంది దర్శకులను, రచయితలను, నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. నేను కూడా కెరీర్‌ ప్రారంభంలో గోపీ గారి ఆఫీసుకు వెళ్లేవాడిని. కానీ ఆయనతో సినిమా కుదరలేదు. ఇక రోటి కపడా రొమాన్స్‌తో ఈ నవంబరు 22న చాలా మంది నూతన నటీనటులు పుట్టబోతున్నారు. తప్పకుండా ఈ చిత్రం విజయం సాధించి, అందరికి మంచి బ్రేక్‌ నివ్వాలి.  తప్పకుండా అందరూ థియేటర్‌లో ఈ సినిమా చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను' అన్నారు. 
 
దర్శకుడు విక్రమ్‌ రెడ్డి మాట్లాడుతూ '' చాలా కష్టపడి దర్శకుడి నా పేరు చూసుకుంటున్నాను. ఈ సినిమాను కూడా ఎంతో కష్టపడి చేశాను. నేటి యూత్‌కు కనెక్ట్‌ అయ్యే విధంగా ఈసినిమా ఉంటుంది. ఈ సినిమా అందరిని నవ్విస్తుంది..ఏడిపిస్తుంది.. బాధపెడుతుంది.. ఆలోచింపజేస్తుంది. కుటుంబంతో చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ , థియేట్రికల్‌ రైట్స్‌ ఇలా అన్ని హక్కులు విడుదలకు ముందే అమ్మేశారు. సినిమా చూసి నచ్చి అందరూ హక్కులు కొనుక్కున్నారు. దీంతో మాకు విజయంపై మరింత నమ్మకం పెరిగింది. ఈ సినిమా విజయం సాధించకపోతే నేను దర్శకుడిగా రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తున్నాను'' అన్నారు. 
 
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ '' ఈ సినిమాలో అన్ని ఎమోషన్ష్‌ వుంటాయి. ముఖ్యంగా నేటి యూత్‌కు నచ్చే లవ్‌స్టోరీలో ఓ భిన్నమైన కోణాన్ని దర్శకుడు ఈ చిత్రంలో ఆవిష్కరించాడు. సినిమాను చాలా మందికి చూపించాం. అందరికి ఎంతో బాగా నచ్చింది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందే నమ్మకం వుంది'' అన్నారు. 
 
కోన వెంకట్‌ మాట్లాడుతూ'' ఈ ఒక్క సినిమాతో సినీ పరిశ్రమకు ఇంత మంది న్యూ టాలెంట్‌ పరిచయం కావడం మాలాంటి వారందరికి ఎంతో రిలీఫ్‌. న్యూ టాలెంట్‌ ఎవరికి కావాలన్న బెక్కం వేణు సినిమాలను చూసి నటీనటులను ఎంపిక చేసుకోవచ్చు. సాధారణంగా స్టార్స్‌తో చేసే ఫిలింస్‌ డబ్బునే ఇస్తాయి. ఇలాంటి కాన్సెప్ట్‌ ఓరియెంటెండ్‌ సినిమాలు టాలెంటెడ్‌ ఆర్టిస్టులను పరిచయం చేస్తాయి.ఇలాంటి సినిమాలు కంటెండ్‌ ఈజ్‌ కింగ్‌ అని ప్రూవ్‌ చేస్తుంటాయి. ఈ  సినిమా కూడా అదే కోవలోకి చేరాలని, ఈ చిత్రం టీమ్‌కు మంచి విజయం చేకూరాలని కోరుకుంటున్నాను'' అన్నారు.