ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 16 నవంబరు 2024 (16:45 IST)

సామాన్యులే సెలబ్రిటీలుగా డ్రింకర్ సాయి టీజర్ లాంఛ్

kirrak seetha, Dharma, Aishwarya Sharma, Amberpet Shankar, Kiran Tirumalasetti, Ismail Shaik, Laharidhar basavaraju
kirrak seetha, Dharma, Aishwarya Sharma, Amberpet Shankar, Kiran Tirumalasetti, Ismail Shaik, Laharidhar basavaraju
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. ఈ రోజు "డ్రింకర్ సాయి" సినిమా టీజర్ ను సామాన్యులే సెలబ్రిటీలుగా ఆటో డ్రైవర్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్, మోటార్ మెకానిక్, వెయిటర్, కూలీ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. 
 
ఈ కార్యక్రమంలో నిర్మాత ఇస్మాయిల్ షేక్ మాట్లాడుతూ - "డ్రింకర్ సాయి" సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాం. ప్రేక్షకుల మనసుల్ని కదిలించే చిత్రమిది. చిన్న సినిమా ఓటీటీలో, పెద్ద సినిమా థియేటర్స్ లో చూడాలని అనుకుంటారు కానీ మా "డ్రింకర్ సాయి" సినిమా థియేటర్స్ లో బెస్ట్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. త్వరలోనే "డ్రింకర్ సాయి" సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.
 
నిర్మాత బసవరాజు లహరిధర్ మాట్లాడుతూ - అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ప్రాపర్ మూవీ "డ్రింకర్ సాయి". ధర్మ పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. మీరు టీజర్ లో చూసింది కొంతే. సినిమాలో ఇంకా చాలా కంటెంట్ ఉంది. మీ అందరి సపోర్ట్ మా "డ్రింకర్ సాయి" సినిమా దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు. 
 
హీరోయిన్ ఐశ్వర్య శర్మ మాట్లాడుతూ - "డ్రింకర్ సాయి" సినిమా టీజర్ లాంఛ్ కు వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చి, నేను ఈ క్యారెక్టర్ చేయగలను అని బిలీవ్ చేసిన డైరెక్టర్ కిరణ్ గారికి థ్యాంక్స్. ఇలాంటి మంచి మూవీతో తెలుగు ఆడియెన్స్ ముందుకు రావడం సంతోషంగా ఉంది. "డ్రింకర్ సాయి" మంచి లవ్ స్టోరీతో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. షూటింగ్ టైమ్ లో హీరో ధర్మ ఎంతో సపోర్ట్ అందించారు. టీమ్ అందరికీ నా థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
 
నటి కిర్రాక్ సీత మాట్లాడుతూ - "డ్రింకర్ సాయి" సినిమాలో కీలక పాత్రలో నటించాను. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కు థ్యాంక్స్ చెబుతున్నా. టీజర్ చూసి సినిమాపై ఒపీనియన్ కు రాకండి. ఈ సినిమాలో ఎన్నో బ్యూటిఫుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా ఆద్యంతం మీరు ఎంజాయ్ చేస్తారు. థియేటర్స్ లో తప్పకుండా "డ్రింకర్ సాయి" చూడండి. అన్నారు.
 
హీరో ధర్మ మాట్లాడుతూ, మా పేరెంట్స్ ప్రోత్సాహం వల్లే ఇక్కడిదాకా రాగలిగాను. అలాగే శంకర్ అన్న మా మూవీకి ఎంతో సపోర్ట్ అందించారు. ఆయన సినిమాలో ఓ మంచి రోల్ కూడా చేశారు. ఆయన ఇచ్చిన సపోర్ట్ ను ఎప్పుడు మర్చిపోలేము. "డ్రింకర్ సాయి" చూసి మీరు ఇది యూత్ ను చెడగొట్టే సినిమా అనుకోకండి. మంచి లవ్ స్టోరీ ఉంది, అలాగే మీకు నచ్చే ఎన్నో ఎలిమెంట్స్ కథలో ఉన్నాయి. అన్నారు.
 
దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి మాట్లాడుతూ - సాయి అనే పేరున్న యువకుడు దాదాపు ఇంటికొకరు ఉంటారు. మన సినిమాలో హీరో ఎక్స్ ప్రెస్ లా తాగుతుంటాడు అందుకే మూవీకి "డ్రింకర్ సాయి" అనే పేరు పెట్టాం. టీజర్ చూసి ఇబ్బందికరంగా కొన్ని మాటలు ఉన్నాయి అనే అభిప్రాయం కలుగుతుంది. అయితే అవి మన రియల్ లైఫ్ లో మాట్లాడుకునే మాటలే. టీజర్ చూసి నెగిటివ్ ఇంప్రెషన్ కలిగిన వారు థియేటర్ లో సినిమా చూస్తే మంచి సినిమా చేశాడని దర్శకుడిగా నన్ను ప్రశంసిస్తారు. ఈ మాట నమ్మకంతో చెప్పగలను. థియేటర్ లో "డ్రింకర్ సాయి" సినిమా చూడండి, మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.