పవన్ కల్యాణ్ సీఎం కావడం తథ్యం: బండ్ల గణేష్ జోస్యం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలపై నిర్మాత బండ్ల గణేష్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అందరూ రాజకీయ నేతల వలె స్కామ్‌లు చేయడం పవన్‌కప రాదని.. ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకోవడం పవన్‌కు తెలీదన్నారు. పథకా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలపై నిర్మాత బండ్ల గణేష్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అందరూ రాజకీయ నేతల వలె స్కామ్‌లు చేయడం పవన్‌కప రాదని.. ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకోవడం పవన్‌కు తెలీదన్నారు. పథకాలు రచించడం కంటే ప్రజాసేవ చేయాలనే బలమైన సంకల్పం పవన్‌కు ఉందని చెప్పుకొచ్చారు. అలాంటి నాయకత్వ లక్షణాలు ప్రస్తుతం పవన్ కల్యాణ్‌కు మాత్రమే సొంతం అంటూ మరోసారి పవన్‌పై తన భక్తిని చాటుకున్నాడు.
అంతేకాకుండా ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తికి అనుభవం ఉండాలంటూ ఆవేశంతో మంచి నిర్ణయాలు తీసుకునే నేత రాజకీయాల్లో పనికిరాడా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు. ఏదో ఒకరోజు పవన్ కల్యాణ్ సీఎం కావడం తథ్యం అని జోస్యం చెపుతూ నిజాయితీగా ఉన్న ఆయనకు దేవుడు ఇచ్చే బహుమతి అదేనని అంటూ పవన్‌కు పూర్తి మద్దతు తెలిపాడు బండ్ల గణేష్.