పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మళ్లీ మళ్లీ మాటలెందుకు? బండ్ల గణేష్  
                                       
                  
                  				  బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ అభిమాని, పవన్‌కి భక్తుడు అన్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌రెడ్డి మోహన్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని సినీ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా నిలవడం పవన్ కళ్యాణ్ మనసత్త్వం అని బండ్ల గణేష్ అన్నారు. 
				  											
																													
									  
	 
	జగన్‌కు దేవుడు మంచి భవిష్యత్తు ఇచ్చాడని, పదే పదే పవన్‌పై ఈ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మళ్లీ మళ్లీ ఎందుకు మాట్లాడుతున్నారు? అంటూ ప్రశ్నించారు. దేశం కోసం, సమాజం కోసం బతికే వ్యక్తి పవన్ అని అన్నారు. ఎవరి దగ్గరా ఒక్క రూపాయి తీసుకోకుండా తన స్టార్ స్టేటస్‌ను వదిలి ప్రజల కోసం, సమాజం కోసం బతుకుతున్న ఆయన జనసేన పార్టీని నడుపుతున్నారు. 
				  
	 
	పవన్ కళ్యాణ్‌కు కులమత బేధాలు లేవని, అలా ఉంటే నన్ను నిర్మాతగా చేసి ఉండేవారు కాదు. తన స్వలాభం కోసం ఏ పనీ చేయరని బండ్ల గణేష్ అన్నారు.