శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (10:00 IST)

ప్రపంచ పర్యావరణ దినోత్సవం- థీమ్ ఇదే.. Beat Plastic Pollution..

orld Environment Day 2023
orld Environment Day 2023
ప్రపంచ వ్యాప్తంగా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు. పర్యావరణాన్ని పరిరక్షించడం, పెంపొందించుకోవడంలో మన అందరి బాధ్యతను గుర్తుచేయడం ఈ రోజు లక్ష్యం. పర్యావరణ వనరులను కాపాడటం.. పర్యావరణ సంరక్షణకు అనుకూల పద్ధతులను ప్రోత్సహించడం ఈ రోజుటి లక్ష్యం. ఇందులో భాగంగా చెట్లను నాటడం, వ్యర్థాలను తగ్గించడం లేదా పునరుత్పాదక శక్తిని అందించడం వంటివి ప్రారంభించాలి. 
 
ప్రపంచ పర్యావరణ దినోత్సవం పర్యావరణ అభివృద్ధిపై అవగాహనను పెంచుతుంది. స్థిరమైన భవిష్యత్తు కోసం పర్యావరణ సవాళ్లను పరిష్కరించేందుకు ప్రేరేపిస్తుంది. 
 
ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2023 #BeatPlasticPollution అనే శక్తివంతమైన ప్రచారం ద్వారా ప్లాస్టిక్ కాలుష్యాన్ని పరిష్కరించే అత్యవసర లక్ష్యంపై దృష్టి సారిస్తోంది. "ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారాలు" అనేదే ఈ ఏడాది పర్యావరణ దినోత్సవ థీమ్.