గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 22 జూన్ 2017 (09:35 IST)

శిరీషను కొట్టి చంపేశారు... క్యారెక్టర్‌పై చెడు ముద్రవేస్తున్నారు... శిరీష బాబాయ్

తమ బిడ్డ శిరీషను రాజీవ్, శ్రవణ్, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిలు కలిసి కొట్టి చంపేశారనీ, ఆ తర్వాత ముగ్గురూ కలిసి డ్రామా ఆడి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత ఈ కేసు నుంచి బయటపడే

తమ బిడ్డ శిరీషను రాజీవ్, శ్రవణ్, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిలు కలిసి కొట్టి చంపేశారనీ, ఆ తర్వాత ముగ్గురూ కలిసి డ్రామా ఆడి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆమె క్యారెక్టర్‌పై చెడు ముద్ర వేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా, తమ బిడ్డ ఎంతో ధైర్యవంతురాలనీ, ఆత్మహత్య చేసుకునేంత పిరికిరాలు కాదనీ ఆయన అంటున్నారు.
 
శిరీష ఆత్మహత్య తర్వాత మీడియాలో పలు రకాలుగా కథనాలు వస్తున్నాయి. వీటిపై శిరీష బాబాయి శ్రీనివాస్ రావు స్పందిస్తూ మీడియాలో వస్తున్న కథలు బాధాకరంగా ఉన్నాయన్నారు. వాస్తవాలను వదిలివేసి... తమ బిడ్డ క్యారెక్టర్‌పై చెడుముద్ర వేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. శిరీషది ముమ్మాటికి హత్యేనన్నారు. 
 
శిరీష తలపై గాయం జుట్టు పట్టుకొని లాగితే అయ్యింది కాదని, బలంగా కొట్టడం ద్వారా అయిందన్నారు. జుట్టుపట్టుకొని లాగితే తలకు అంతపెద్ద గాయం అవుతాదా? అని ప్రశ్నించారు. 'శిరీష వారి నుంచి తప్పించుకునేందుకు కారు దిగి పారిపోయింది. ఈ క్రమంలో ఎక్కడో చెట్టుకింద ఉండి తన లొకేషన్‌ను భర్తకు షేర్ చేసింది. పారిపోయిన శిరీషను పట్టుకొని బలంగా కొట్టి చంపేశారు. ఆ తర్వాత రాజీవ్, శ్రవణ్, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ముగ్గూరు కలిసి డ్రామా ఆడి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు' అని శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు.
 
ఈ కేసులో బాధితురాలైన శిరీషను బ్లేమ్ చేస్తూ ప్రధాన నిందితులైన రాజీవ్, తేజస్విని బ్యాక్‌గ్రౌండ్‌ను ఎందుకు బయటకు తీయడం లేదని శ్రీనివాస్ రావు ప్రశ్నించారు. తేజస్విని, రాజీవ్, శిరీష ముగ్గురూ కలిసి సెటిల్‌మెంట్ కోసం స్టేషన్‌కు వెళ్లారంటున్నారు.. అసలు ఆ సెటిల్‌మెంట్ ఏంటనేది బయటపెట్టాలని డిమాండ్ చేశారు.