గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 14 నవంబరు 2024 (23:17 IST)

భక్తి-ముక్తి, శక్తి-యుక్తి ఈ 4 అవసరం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో శ్రీశ్రీ రవిశంకర్ (video)

Sri Sri Ravishankar-Pawan
కర్టెసి-ట్విట్టర్
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ గురుదేవ్ గురువారం ఉదయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారిని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో శ్రీశ్రీ రవిశంకర్ గారిని ఉప ముఖ్యమంత్రి గారు సత్కరించారు. అనంతరం శ్రీశ్రీ రవిశంకర్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సత్కరించి ఆశీర్వదించారు.
 
Sri Sri Ravishankar-Pawan
కర్టెసి-ట్విట్టర్
ఈ సందర్భంగా గురూజీ మాట్లాడుతూ... జీవితంలో సక్సెస్ సాధించాలంటే మనిషికి భక్తి-ముక్తి అవసరం. అలాగే ప్రపంచంలో గెలవాలంటే శక్తి-యుక్తి అవసరం. ఈ 4 వుంటే మనిషికి విజయం తథ్యం. అదేవిధంగా రాజ్యాన్ని పాలించే రాజు సంతోషంగా ఇంట్లో కూర్చుని హాయిగా వున్నాడు అంటే... ఆ దేశం అభివృద్ధి ఆగిపోతుందని అర్థం అని అన్నారు.
 
అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ.. ఈ కలియుగంలో అధర్మం 3 పాదాలు, ధర్మం 1 పాదం మీద నడుస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఐతే ఆ ఒక్క పాదాన్ని కూడా నడవనీయకుండా చేస్తానంటే మాత్రం నేను ఊరుకోను, అందుకే విజయమో అపజయమో ధర్మం కోసం రాజకీయాల్లోకి వచ్చాను అని అన్నారు.