సోమవారం, 28 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 అక్టోబరు 2024 (12:27 IST)

శ్రీశ్రీ రవిశంకర్‌కు అత్యున్నత ఫిజి "పౌర పురస్కారం"

ravishankar
రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్‌ను అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. మానవ స్ఫూర్తిని పెంపొందించడంలో, విభిన్న సమాజాలకు చెందిన ప్రజలు శాంతి, సామర్యాలతో ఐక్యమత్యంతో జీవించేందుకు అవిశ్రాంతంగా కృషి చేసినందుకు ప్రపంచ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌కి దక్షిణ పసిఫిక్ దేశమైన ఫిజీ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. రవిశంకర్‌కు రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ అనే పౌర పురస్కారాన్ని ప్రాదానం చేసింది. దీన్ని 'హానరీ ఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ' బిరుదును ఇచ్చారు. రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ అధ్యక్షుడు హెచ్.ఇ. రతు విలియమ్ ఎం కటోనివెరే ఈ పురస్కారాన్ని ప్రదానం చేసి గౌరవించారు. 
 
కాగా, గురుదేవ్‌కు అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించిన ఆరో దేశంగా ఫిజీ ప్రపంచంలోని అవతరించింది, ప్రపంచవ్యాప్తంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా తన బహువిధ సేవా కార్యక్రమాల ద్వారా సంతోషాన్ని, సామరస్యాన్ని వ్యాప్తి చేస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అతని మానవతావాద పని యొక్క విస్తృత పరిధిని గుర్తించింది. మానసిక ఆరోగ్యం, విద్య, పర్యావరణం, మహిళలు, యువత సాధికారత, మరియు ఒత్తిడి ఉపశమనం, ధ్యాన కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. 
 
ప్రస్తుతం రవిశంకర్ ఫిజీ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రవిశంకర్‌తో ఫిజీ దేశ అధికార ప్రముఖులు సంభాషించారు. వీరిలో ఫిజీ ఉప ప్రధానమంత్రి, విలియమ్ గవోకా, ఫిజీలోని యూఎన్‌ రెసిడెంట్ కోఆర్డినేటర్ డిర్క్ వాగెనర్ తదితరులు ఉన్నారు. యువతకు సాధికారత కల్పించడం ద్వారా ద్వీప దేశం యొక్క సమగ్ర ప్రగతికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎలా దోహదపడుతుందని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.