సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2022 (12:18 IST)

బైకుపై రొమాన్స్.. రెచ్చిపోయిన జంటకు పోలీసులు ఝలక్

lovers
బైకుపై రొమాన్స్ చేస్తూ ఓ యువజంట కెమెరాకు చిక్కారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి అసభ్యకర రీతిలో డ్రైవింగ్ చేస్తూ పక్కవారిని ఇబ్బందికి గురిచేశారు. గాజువాక స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ రోడ్‌లో అజయ్ జంట నడిరోడ్డుపైనే బరితెగించారు. 
 
పబ్లిక్‌లో బైకుపై హెల్మెట్ లేకుండా ఒకరికెదురు మరొకరు కూర్చొని రెచ్చిపోయారు. అక్కడితో ఆగలేదు.. అతనిని గట్టిగా హగ్ చేసుకుంది. ఇంకా చెప్పలేని పనులు చేసింది. 
 
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఇద్దరిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా రెచ్చిపోయిన జంటకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.