శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 జులై 2021 (12:02 IST)

డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థులకు ద్విభాష పాఠ్య పుస్తకాలు

ఏపీలో అన్ని కళాశాలల్లో ఈ ఏడాది నుంచి తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసి, ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థులకు ద్విభాష పాఠ్య పుస్తకాలను అందించనున్నారు.

ఈ రెండు భాషల్లోనూ పాఠ్యాంశాలు ఉండేలా కొత్తగా పుస్తకాలు ముద్రిస్తోంది. ఇందుకు ఉన్నత విద్యామండలి డిగ్రీ అధ్యాపకులను నియమించనుంది. 
 
మొదటి ఏడాదిలో సెమిస్టర్‌ 1, 2లకు ప్రధాన సబ్జెక్టులైన భౌతిక, రసాయన, జీవ, జంతు, ఆర్థిక, రాజనీతి శాస్త్రాలు, గణితం, కామర్స్‌, చరిత్ర సబ్జెక్టులకు కొత్త పుస్తకాలు రానున్నాయి. 
 
ఇప్పటి వరకు ప్రైవేటు పబ్లిషర్స్‌ ముద్రించిన పుస్తకాలే మార్కెట్‌లో అందుబాటులో ఉండగా.. ఈ ఏడాది ఉన్నత విద్యామండలి కూడా అందించనుంది. ఒకే పాఠాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో పక్కపక్కనే ముద్రించనుంది. ఆంగ్లం అర్థం కానివారు తెలుగులో చదువుకునేందుకు వీలుగా ఈ పద్ధతి పాటిస్తున్నారు.