గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , శనివారం, 30 అక్టోబరు 2021 (16:31 IST)

అదే జరిగితే... జగన్ తనని తాను అవమానించుకోవడమే...

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ తన రాజకీయ భవిష్యత్ కోసం పోలీసుల కాపలాతో పాదయాత్ర చేశారని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర భవిష్యత్ కోసం అమరావతి రైతులు "న్యాయస్థానం నుండి దేవస్థానం" పాదయాత్ర చేస్తూంటే  అడ్డుకోవడం అంటే జగన్ తనని తాను అవమానించుకోవడమే అని వ్యాఖ్యానించారు. 
 
 
జగన్ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చి, నేడు అదే  పాదయాత్ర చేసే రైతులకు పోలీసుల రక్షణ ఇవ్వాల్సింది పోయి... రాళ్ళ దాడి జరగొచ్చు అని వైసీపీ నేత‌లు హెచ్చ‌రించ‌డం దారుణ‌మ‌న్నారు. ఈ  ప్రభుత్వం రాష్ట్రంలో పాలన చేసే నైతిక హక్కు కోల్పోయిందన్నారు. పోలీసులు శాంతి భద్రతలు కాపాడడానికే కాని, రాళ్ల దాడి కుట్రలు చేసే వారి కోసం కాదని తెలిపారు. న్యాయ స్థానం అనుమతితో " న్యాయస్థానం టూ దేవస్థానం" ఇక భద్రత, బాధ్యత పోలీసులదే అని లంకా దినకర్ పేర్కొన్నారు.